"ఎక్స్" తో ఆపిల్ కు లాభాల పంట


ఫింగర్‌ ప్రింట్‌ సెక్యూరిటీ’ ఫీచర్ తో నాలుగేళ్లకిందట ఆపిల్‌ ఫోన్ వస్తే సూపర్ అన్నారు. మిగిలిన ఫోన్ల తయారీ కంపెనీలు దాన్ని అందుకోవడానికి మూడేళ్లు పట్టింది. ఇప్పుడు అన్ని స్మార్ట్‌ఫోన్లలో ఫింగర్‌ ప్రింట్‌ సెక్యూరిటీ ఉంటున్నది. ఇదే ఆపిల్ ప్రత్యేకత. ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీని పరిచయం చేయటం, మిగిలిన సంస్థల కంటే ముందుండటం దీని విశేషాలు. తాజాగా ‘ఆపిల్‌ ఎక్స్‌’లో ఫింగర్‌ ప్రింట్‌ సెక్యూరిటీ కంటే ఎన్నో రెట్లు అధిక భద్రమైన ఫేస్‌ రికగ్నిషన్‌ టెక్నాలజీ, వేగవంతమైన ఏ11 బయోనిక్‌ ప్రాసెసర్‌, ఎడ్జ్‌-టూ-ఎడ్జ్‌ డిస్‌ప్లే, నో హోమ్‌ బటన్‌, వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ వంటి విశేషాలు ఉన్నాయి. ఇప్పటికే మొబైల్‌ పరిశ్రమలో అత్యధిక లాభాలు ఆర్జిస్తున్న ఆపిల్ ఈ ఆపిల్‌ ఎక్స్‌ తో మరిన్ని లాభాలను ఆర్జించనుంది. క్రితం ఏడాది నవంబరులో ఐఫోన్‌ 7ప్లస్‌ను ఆపిల్‌ విడుదల చేసింది. అత్యధికంగా అమ్ముడైన ఈ ప్రోడక్ట్ కారణంగా గత ఏడాది చివరి త్రైమాసికానికి రికార్డు స్థాయి లాభాలు ఆర్జిచింది. ఈ మూడు నెలల్లో ఆపిల్‌ ఆదాయం 78.4 బిలియన్‌ డాలర్లు. ఇప్పుడు ఈ నవంబరులో ఆపిల్‌ ఎక్స్‌ విడుదలైంది.

ముఖ్యాంశాలు