కాంగ్రెస్ ఎప్పుడూ నిజమే చెబుతుంది : రాహుల్

November 12, 2017

కాంగ్రెస్‌ పార్టీ ఎప్పుడూ నిజమే మాట్లాడుతుందని ఆపార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. తాము ప్రధానమంత్రి నరేంద్రమోదీ విధానాలను విమర్శిస్తాం కానీ ఆయనను ఎప్పుడూ అగౌరవపరచబోమని రాహుల్‌ గాంధీ అన్నారు. ఆదివారం గుజరాత్‌ ఎన్నికల ప్రచార సభలో అయన మాట్లాడుతూ యూపీఏ ప్రభుత్వ హయాంలో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి మోదీ నాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ను అగౌరవపరిచేలా అనేకసార్లు మాట్లాడారని విమర్శించారు. కానీ మేము ఆలా చేయం... మేము మోదీ తప్పులను గుర్తిస్తాం. కానీ ఆయనను అవమానించం.. అన్నారు రాహుల్. "ఎంత విమర్శించినా మోడీ మా  ప్రధాని అనే విషయం మాత్రం మేం మరిచిపోము" అని రాహుల్‌ వ్యాఖ్యానించారు. 

Facebook
Twitter