టికెట్ లేని ప్రయాణమే లాభదాయకం!


టికెట్ లేని ప్రయాణం లాభదాయకం ఎలాగా అని ఆశ్చర్యపోకండి. అది ప్రయాణికులకు కాదు.. రైల్వేకి! అది ఎలాగంటే.. రైళ్లలో టికెట్‌ లేని ప్రయాణికులకు విధించిన జరిమానాతో రైల్వే శాఖ భారీగా ఆర్జించింది. ఏడు నెలల వ్యవధిలో రూ.100.67కోట్లు ఈ విధంగా వసూలు చేసినట్లు కేంద్ర రైల్వే శాఖ తెలిపింది. ఏప్రిల్‌ నుంచి అక్టోబర్‌ వరకు కమర్షియల్‌ డిపార్ట్‌మెంట్‌ నిర్వహించిన స్పెషల్‌ డ్రైవ్‌ ద్వారా టికెట్‌ లేని ప్రయాణికులను అధికారులు పట్టుకుని 19.82లక్షల కేసులను నమోదు చేశారు. గత ఏడాది కంటే ఇది 21.08శాతం అధికమని అధికారులు తెలిపారు. గత సంవత్సరం జరిమానా కింద రైల్వేకి రూ.80.02కోట్లు రాగా.. ఈ ఏడాది 25.81 శాతం పెరిగి రూ.100.67కోట్లు వచ్చింది.

ముఖ్యాంశాలు