నా పేరులో గాంధీ లేకపోతే?

భారతీయ జనతా పార్టీ ఎంపీ వరుణ్ గాంధీ చేసిన వ్యాఖ్యలు విశేష చర్చనీయాంశాలుగా మారాయి.  తన ఇంటి పేరు గాంధీ కాకపోయి ఉంటే 29 ఏళ్లకే ఎంపీ అయి ఉండేవాడినా? అని ఆయన గువహటిలో జరిగిన ఓ సభలో ఈ ప్రశ్న వేశారు. ‘‘నా పేరు ఫెరోజ్‌ వరుణ్‌ గాంధీ. ఇంటిపేరులో గాంధీ లేకపోయి ఉంటే నేను ఇప్పుడు ఎక్కడ ఉండేవాడినో అందరికీ తెలుసు. అని అయన వ్యాఖ్యానించారు. ఇంటి పేరు,పేరు ప్రతిష్ఠలు ముఖ్యం కాదని, అందరికీ సమానహక్కులు లభించాలని తన అభిమతంగా తెలిపారు. ప్రజాప్రతినిధులు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే వారిని తొలగించే హక్కు ప్రజలకు ఇవ్వాలని అయన అన్నారు. 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని(ప్రైవేట్‌ బిల్లు ద్వారా) సవరించాలని వరుణ్ సూచించారు. అలాంటి అవకాశమే ఉంటే  హామీలు నెరవేర్చని ఎంపీలను 75 శాతం వరకు ప్రజలు తిరస్కరించే అవకాశం ఉంటుందని తెలిపారు. రాజకీయాలు,. క్రికెట్, వ్యాపారం, సినిమాలు.. ఇలా వీటిలోనూ సామాన్యులకు అవకాశాలు ఉండడంలేదని వరుణ్ గాంధీ అన్నారు. 

Facebook
Twitter