ముఖ్యాంశాలు

నిఘా కోసం మినీ మానవ రహిత విమానాలు


సరిహద్దుల్లో పాకిస్థాన్‌, చైనా దేశాల దురుద్దేశాలు పసిగట్టి, సమర్థంగా ఎదుర్కోవాలంటే నిఘాను పటిష్టం చేయాల్సిన అవసరాన్ని భారత్ గుర్తించింది. ఇందుకోసం 600 పెద్ద డ్రోన్లు లేదా మానవ రహిత విమానాలను కొనుగోలు చేయనుంది. ఉగ్రవాదుల చొరబాట్లను, బలగాల సరిహద్దు అతిక్రమణలను వీటి ద్వారా మన సైనికాధికారులు ట్యాబు లపై చూసి అంచనాకి రావచ్చు. దాదాపు రూ.వెయ్యి కోట్ల వ్యయంతో వీటిని భారత్ కొనుగోలు చేస్తున్నది. స్వదేశీ కంపెనీలనుంచే వీటిని కొనాలని నిర్ణయించి టెండర్లు కూడా పిలిచారు. సుమారు 12 కంపెనీల నమూనాలను ఇపుడు పరీక్షిస్తున్నారు. మన సైన్యంలో 600 పదాతి దళ బెటాలియన్ లు ఉన్నాయి. ఒక్కో దళానికి ఒక డ్రోన్ చొప్పున వీటిని కేటాయిస్తారు. లద్దాఖ్‌, సిక్కిమ్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌లో ఏటా చైనా సైన్యం దాదాపు 350 సార్లు సరిహద్దు అతిక్రమణలకు పాల్పడుతోంది. వీటిని ముందే కనుగొనడం ఈ డ్రోన్ల ద్వారా సాధ్యం. పాకిస్థాన్‌తో నియంత్రణ రేఖ వెంబడి ఉగ్రవాద చొరబాట్లను నిరోధించొచ్చు. విదేశాల సైనిక మోహరింపులపై వివరాలూ తెలుస్తాయి. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదంపై పోరాడుతున్న సైనిక బలగాలకూ ఈ యూఏవీలు అందుబాటులోకి వస్తాయి. ఫలితంగా ఉగ్రవాదుల కదలికలపై సరైన సమాచారం అందుతుంది. కాల్పుల సమయంలో పౌరులకు హాని జరగకుండా చూడొచ్చు. ఈ మినీ యూఏవీల బరువు 35 కిలోలు. అవి గాల్లో 4వేల-5వేల మీటర్ల ఎత్తు వరకూ ఎగరగలవు. 10 కిలోమీటర్ల దూరం పయనించగలవు. 45 నిమిషాల పాటు గగనవిహారం చేయగలదు.

​సంబంధిత సమాచారం 
తాజా వార్తలు

EDITOR: Deekshitula Subrahmanyam

D.NO.23-19-50, Haripuram,

Rajahmundry, Andhra Pradesh 533105, India

@ Ira News Paper Copyright 2017

Ira News Paper

eMail: iranewspaper@gmail.com

Mobile no.94404 51836

  • iranewspaper
  • iranewspaper
  • Facebook Basic Square
  • Twitter Basic Square
  • Google+ Basic Square
 Follow Us