ప్రపంచ స్థాయి ఆర్థిక నేరగాడు జగన్ :యనమల


ప్రపంచ ఆర్థిక నేరగాళ్ల జాబితాలో చోటు సాధించిన వైఎస్‌ జగన్‌ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పరువు తీశారని ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు విమర్శించారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్‌ రాజకీయాల నుంచి తప్పుకోవాలన్నదే ప్రజల సంకల్పమన్నారు. ఎన్నికల్లో జగన్‌కు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. జగన్‌లాంటి వారు రాజకీయాల్లో ఉండటం ప్రమాదకరం. ఆయనది ప్రజా సంకల్ప యాత్ర కాదు. కేసుల నుంచి తప్పించుకునేందుకు చేపట్టిన యాత్ర అని మంత్రి మండిపడ్డారు. వైఎస్‌ కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుందని, అలా దోచుకున్న ఆస్తులను రక్షించుకునేందుకు, కేసుల నుంచి తప్పించుకునేందుకే జగన్‌ రాజకీయాల్లో కొనసాగుతున్నాడని అన్నారు. ఆర్థిక అక్రమాల ఆరోపణల కింద ఇన్ని కేసులు ఎదుర్కొంటున్న రాజకీయ నాయకుడు ప్రపంచంలోనే మరొకడు లేడని ఎద్దేవా చేసారు. జగన్‌పై కొత్తగా వస్తున్న ఆరోపణలపై సీబీఐ, సీబీడీటీ విచారణ చేయాలని, త్వరగా నిజాలను నిగ్గు తేల్చాలని యనమల డిమాండ్‌ చేశారు.

ముఖ్యాంశాలు