విజ్ఞాన, విహార యాత్రలతో మనోవికాసం


రాజమహేంద్రవరం : ప్రాథమిక స్థాయి విద్యార్థులను విజ్ఞాన, విహార యాత్రలకు తీసుకు వెళ్లడం అభినందనీయమని సర్వ శిక్షా అభియాన్ రాష్ట్ర పరిశీలకులు డాక్టర్ ఎన్. శ్రీనివాస్ అన్నారు. వీరభద్రపురం ప్రాథమిక పాఠశాల చిన్నారులను ప్రధానోపాధ్యాయిని పద్మావతి పుష్కరవనానికి విజ్ఞాన విహార యాత్రకు తీసుకు వెళ్లారు. ఈ సందర్భం గా రాష్ట్ర పరిశీలకులు అక్కడికి వెళ్లి చిన్నారులతో ముచ్చటించారు. ఇలాంటి కార్యక్రమాలు చిన్నారులకు మానసిక వికాసాన్ని,ఆహ్లాదాన్ని పెంచి ఒత్తిడిని పోగొడతాయన్నారు. విద్యార్థులు పుష్కర వనం లో పెంచుతున్న మొక్కలు, వాటి పేర్లు సేకరించారు. ఔషధ మొక్కలను గురించి తెలుసుకున్నామని వారు అధికారికి వివరించారు. అర్బన్ రేంజ్ డి ఐ బి.దిలీప్ కుమార్, ఉపాధ్యాయులు మొండ్రేటి నరేష్, మల్లిపూడి శివాజీ, పద్మలత, అనంత లక్ష్మి, సుమలత, సీ ఆర్ పిలు ప్రసాద్, శ్రీనివాస్, జయంతి శాస్త్రి పాల్గొన్నారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం