సర్వీస్ రూల్స్ కి విరుద్ధంగా ప్రమోషన్లు


రాజమహేంద్రవరం : కాకినాడ మునిసిపల్ కార్పొరేషన్ పరిధి లో ప్రమోషన్లు సర్వీస్ రూల్స్ కి విరుద్ధం గా జరిగాయని , వాటి వల్ల రాజమహేంద్రవరం లోని సీనియర్ ఉపాధ్యాయులకు అన్యాయం జరిగిందని ఏ పి టి ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వఝల అప్పయ్య శాస్త్రి ఒక ప్రకటన లో ఆవేదన వ్యక్తం చేసారు. ఈ మేరకు ఒక వినతి పత్రాన్ని మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆర్ డి సాయిశ్రీకాంత్ కి అందచేసినట్లు పేర్కొన్నారు. మునిసిపల్ కార్పొరేషన్ ఉపాధ్యాయుల సర్వీసు రూల్స్ జి ఓ ఎం ఎస్ నెంబరు 322 ది 7-12-2016 నుండీ అమలులోకి వచ్చాయని, కానీ మునిసిపల్ ఆర్ డి కార్యాలయం నుండి విడుదల అయిన సీనియారిటీ జాబితా ప్రకారం వరుస నెంబరు 350 నుండి 353 వరకు ఎస్ జి టి లను ది 15-12-2016 తరువాత సహఉపాధ్యాయులు గా ప్రమోషన్ చేసినట్టు చూపినారని పేర్కొన్నారు. దీనివల్ల రాజమహేంద్రవరం లోని ఉపాధ్యాయులకు అన్యాయం జరిగింది కనుక తగు చర్యలు తీసుకోవాలని విన్నవించినట్టు అప్పయ్య శాస్త్రి తెలిపారు. ఏ పి టి ఎఫ్ నగర కార్యదర్శి కె వి వి సత్యనారాయణ, అదనపు కార్యదర్శి ఎ ఉదయ బ్రహ్మం కూడా ఉన్నారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం