అది నాన్నతో కలిసి పని చేసిన సెట్ : నాగార్జున


అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన అగ్ని ప్రమాదంపై అధినేత, సినీ హీరో అక్కినేని నాగార్జున మీడియాతో మాట్లాడారు. ‘మనం’ సినిమా కోసం వేసిన ఈ భారీ సెట్ పూర్తిగా కాలిపోవడం బాధగా ఉందన్నారు. తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావుతో కలిసి నటించిన చివరి సినిమా కావడంతో ఈ సెట్ ను చూసినప్పుడల్లా ఆయన గుర్తొచ్చేవారన్నారు. మనుషులే పోయినప్పుడు.. సెట్‌ కాలిపోతే ఏముందిలే అని విరక్తిగా ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఈ అగ్ని ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాకపోవడం తనకు ఒకింత సంతోషం కలిగించిందని చెప్పారు. భారీగా ఎగిసిపడుతున్న మంటలను ఫైర్‌ సిబ్బంది కేవలం 15 నిమిషాల్లో ఆర్పారన్నారు. కాలిపోయిన ఈ సెట్ కు అప్పట్లో రూ.2 కోట్లకు పైనే ఖర్చయిందని నాగార్జున చెప్పారు. ‘రాజు గారి గది’ తో పాటు పలు సినిమాల షూటింగ్ ఈ సెట్ లో జరిగిందని గుర్తు చేసుకున్నారు.

ముఖ్యాంశాలు