అన్నపూర్ణ స్టూడియో లో అగ్ని కీలలు


హైదరాబాద్‌ లో బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌-2 లోని అన్నపూర్ణ స్టూడియోలో సోమవారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. స్టూడియో లో ఉన్న ‘మనం’ సినిమాకు సంబంధించిన ఒక పాత సెట్టింగ్‌కు నిప్పుంటుకుని మంటలు రేగాయి. పెద్దఎత్తున మంటలు ఎగసిపడడంతో ఫిలింనగర్‌తోపాటు నగరంలోని పలు ప్రాంతాల అగ్నిమాపక శకటాలు వచ్చాయి. విద్యుత్‌ షాక్‌ సర్క్యూట్‌ ఈ ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. సంఘటనా స్థలం వద్దకు మీడియాను, స్థానికులను అనుమతించలేదు.

ముఖ్యాంశాలు