ఆ నలుగురు.. కలవడంతో డ్రాగన్ కలవరం


అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియా, భారత్‌ చేతులు కలపడాన్ని చైనా తట్టుకోలేకపో తున్నది. తమను లక్ష్యంగా చేసుకునే మనీలాలో సాగుతున్న ఆసియాన్‌ సమావేశా ల్లో ఈ నాలుగు దేశాలు ప్రత్యేకంగా సమావేశం అయ్యాయని బెదురుతోంది. ఇండో-పసిఫిక్‌ ప్రాంతాన్ని స్వేచ్ఛాయుత, అభివృద్ధి చెందిన ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియా, భారత్‌ అధినేతలు తమ సమావేశంలో చర్చించారు. ఈ సమావేశానికి చైనాను కలుపుకోకపోవడం... అలాగే భారత్ ను ఆసియాలో కీలక భాగస్వామిగా ఆ దేశాలు భవిస్తూ ఉండడం చైనాను కలవరపరుస్తున్నాయి. ఇండో-పసిఫిక్‌ ప్రాంతాభివృద్ధి ప్రతిపాదనలు తమకు ఆమోదయోగ్య మేనని, కానీ దీనిని రాజకీయం చేస్తే మాత్రం ఒప్పుకోబోమని చైనా విదేశాంగశాఖ ప్రతినిధి గెంగ్‌షుంగ్‌ స్పష్టం చేసారు. ఒక దేశానికి వ్యతిరేకంగా కొత్త విధానాలు ఉండకూడదన్నారు. ఆసియా-పసిఫిక్‌ ప్రాంతంలో భారత్‌ను కూడా కీలక భాగస్వామిగా చేర్చేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ట్రంప్‌ కనబరుస్తున్న ప్రత్యేక శ్రద్ధే డ్రాగన్చొ దేశానికి ఇబ్బంది కలిగిస్తోంది. ఆసియా-పసిఫిక్‌ ఆర్థిక సహకారంలో 21 సభ్యదేశాలున్నాయి. పసిఫిక్‌ తీరప్రాంతం కలిగిన దేశాలు ఈ కూటమిగా ఏర్పడ్డాయి. అయితే హిందూమహాసముద్రంలో భారత్‌కు వ్యూహాత్మక స్థానాలు చాలా ఉన్నాయి. చైనాను కట్టడి చేయాలంటే ఇక్కడ అమెరికాకు భారత్చే సహకారం కావాలి. అందుకే ముందస్తువ్యూహంలో భాగంగా ట్రంప్‌ ఎపెక్‌లో భారత్‌ సభ్యత్వానికి మద్దతు పలుకుతున్నారు. ఈ ప్రాంతంలో భారత్‌ ప్రాబల్యం పెరుగుతుండటంపై చైనా బెంబేలెత్తి పోతున్నది.

ముఖ్యాంశాలు