ఇజ్రాయిల్ లో గజల్ శ్రీనివాస్ శాంతి సుహృద్భావ యాత్ర


గజల్ గాయకులు “మాస్ట్రో” డా. గజల్ శ్రీనివాస్ 11 వ తేదీ నుండి ఇజ్రాయిల్ దేశంలో ఇండో-ఇజ్రాయిల్ ఫ్రెండ్ షిప్ ఫోరం అద్వర్యంలో శాంతి సుహృధ్బావ యాత్ర లో పాల్గొంటున్నారు. ఆయన 17 వరకు అక్కడ ఉంటారు. 1918 లో హైఫా యుద్ధ భారత సైన్య విజయ శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని “హైఫా కె యుద్ద వీర్” అనే హిందీ వీడియో గీతాన్ని హైఫా యుద్ద స్మారక ప్రాంగణంలో డా. బి. కె. మోది, బ్రిగేడియర్ మహేంద్ర సింగ్ జోధా, శ్రీ రవి కుమార్ అయ్యర్ లు ఆవిష్కరించనున్నారు. ఈ యాత్రలో భాగంగా తెలవేవ్, హైఫా, జేరుసలం ప్రాంతాలలో, హీబ్రూ, ఉర్దూ భాషలలో గజల్ కచేరీలు చేయనున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ చారిత్రాత్మక ఘట్టమైన హైఫా యుద్ద విజయ శతాబ్ది ఉత్సవాలకు ప్రఖ్యాత పంజాబి కవి శ్రీ రవికాంత్ అన్ మోల్ రచించిన గీతాన్ని ఆలపించడం, హైఫా యుద్ధం జరిగిన ప్రదేశంలో ఈ గీత ఆవిష్కరణ జరగడం అందులో స్వయంగా పాల్గొంటుండడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. శతాబ్ది ఉత్సవాల సందర్భంగా అత్యంత భారీ వ్యయంతో “హైఫా వార్” అనే హింది చలన చిత్రాన్ని నిర్మించేందుకు కూడా సంస్థ పెద్దలు సన్నాహాలు చేస్తున్నట్లు గజల్ శ్రీనివాస్ తెలిపారు.

ముఖ్యాంశాలు