పాస్ పోర్ట్ ఇప్పించాను .. పతకం తెస్తావా మరి!


కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్‌ ఓ జూనియర్‌ బాక్సర్‌కి పాస్‌పోర్ట్‌ విషయంలో సాయం చేసి.. దానికి బదులుగా.. దేశానికి పతకం తేవాలని కోరుతూ ట్వీట్ చేసారు. దిల్లీకి చెందిన ఝలక్‌ తోమర్‌ అనే జూనియర్‌ బాక్సర్‌ ఉక్రెయిన్‌ బాక్సింగ్‌ టోర్నమెంట్‌ కి వెళ్ళాలి. అయితే ఆమెకు పాస్‌పోర్ట్‌ విషయంలో సమస్యలు రాగా తోమర్‌ ఈ విషయమై మంత్రి సుష్మ సాయం కోరింది. వెంటనే స్పందించిన సుష్మ ఆ పని చేసి పెట్టారు. అడిగిన వెంటనే పాస్‌పోర్ట్‌ పని చేసి పెట్టాను... ఇందుకు బదులుగా నువ్వు భారత్‌కు పతకం సాధించాలని ఆమె తోమర్ ని ట్వీట్ తో కోరారు.

ముఖ్యాంశాలు