జపాన్ వీసా ఇక సరళతరం


2018 జనవరి నుంచి భారతీయులకు వీసా నిబంధనలను అత్యంత సరళతరం చేస్తున్నట్లు జపాన్‌ విదేశాంగ మంత్రిత్వశాఖ పేర్కొంది. స్వల్ప కాలం నివసించడానికి వెళ్లే భారతీయులకు మల్టిపుల్‌-ఎంట్రీ-వీసాను ఇవ్వనున్నట్టు తెలిపింది. ఈ నిర్ణయం పర్యాటకులకు, వ్యాపారవేత్తలకు ప్రయోజనకరం. సరళతరం చేసిన వీసా అప్లికేషన్‌ డాక్యుమెంట్ల కింద మల్టిపుల్‌-ఎంట్రీ-వీసా అప్లయ్‌ చేసుకునేటప్పుడు దరఖాస్తుదారులు ఎంప్లాయిమెంట్‌ సర్టిఫికేట్‌ను, వివరణ లేఖను ఇవ్వాల్సిన అవసరం ఇక ఉండదు. ఫోటోతో కూడిన పాస్‌పోర్టు, వీసా అప్లికేషన్‌ ఫాం, ఆర్థిక సామర్థ్యాన్ని నిరూపించే డాక్యుమెంట్లు (టూరిజం కోసం), దరఖాస్తుదారునికి సంస్థకు ఉన్న సంబంధ నిరూపణ పత్రం సమర్పిస్తే చాలని పేర్కొంది. మల్టిపుల్‌-ఎంట్రీ-వీసా ఐదేళ్ల పాటు చెలామణీలో ఉంటుంది. 90 రోజుల పాటు గరిష్టంగా నివసించవచ్చు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం