నంది అవార్డులను గెలుచుకున్న చిత్రాలివే


ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2014, 2015, 2016 సంవత్సరాలకు నంది అవార్డులు, నాగిరెడ్డి-చక్రపాణి జాతీయ అవార్డు, రఘుపతి వెంకయ్య సినిమా పురస్కారాలను ప్రకటించింది. జ్యూరీ కమిటీ సభ్యులు వివరాలను వెల్లడించారు. కమిటీ ప్రతినిధులు నందమూరి బాలకృష్ణ, మురళీ మోహన్‌, గిరిబాబు, జీవిత అమరావతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. 2014, 2015, 2016 సంవత్సరాలకు లెజెండ్‌, బాహుబలి (బిగినింగ్‌), పెళ్లి చూపులు చిత్రాలు నంది అవార్డులను కైవసం చేసుకున్నాయి. ఉత్తమ నటులుగా బాలకృష్ణ, మహేష్‌బాబు, జూనియర్‌ ఎన్టీఆర్‌ నంది అవార్డులకు ఎంపికయ్యారు. ఎన్టీఆర్‌ జాతీయ అవార్డుకు క‌మ‌ల్ హాసన్‌, రాఘవేంద్రరావు, రజనీకాంత్‌ ఎంపికయ్యారు. సంవత్సరాల వారీగా నంది అవార్డుల వివరాలు 2014 ఉత్తమ చిత్రం లెజెండ్‌ 2014 ఉత్తమ నటుడు (బాలకృష్ణ(లెజెండ్‌) 2014 ఉత్తమ ప్రజాదరణ చిత్రం లౌక్యం 2014 ఉత్తమ ప్రతినాయకుడు జగపతిబాబు(లెజెండ్‌) 2014 ఉత్తమ సహాయ నటుడు నాగచైతన్య(మనం) 2014 ద్వితీయ ఉత్తమ చిత్రం- మనం 2014 ఉత్తమ నటి- అంజలి(గీతాంజలి) 2014 ఉత్తమ ఛాయాగ్రాహకుడు సాయి శ్రీరామ్‌(అలా ఎలా) 2014 ఉత్తమ కొరియోగ్రాఫర్‌ ప్రేమ్‌ రక్షిత్‌ 2014 ఉత్తమ ఫైట్‌మాస్టర్‌ రామ్‌ లక్ష్మణ్‌(లెజెండ్‌) 2014 ఉత్తమ బాలనటుడు గౌతమ్‌కృష్ణ (నేనొక్కడినే) 2014 ఉత్తమ రచయిత- ఎం.రత్నం 2014 ఉత్తమ సహాయ నటి- మంచు లక్ష్మి(చందమామ కథలు) 2014 ఉత్తమ హాస్యనటుడు- బ్రహ్మానందం (రేసుగుర్రం) 2015 ఉత్తమ చిత్రం బాహుబలి(బిగినింగ్‌) 2015 ఉత్తమ నటుడు మహేష్‌బాబు(శ్రీమంతుడు) 2015 ఉత్తమ కుటుంబ కథాచిత్రం- మళ్ళీ మళ్లీ ఇది రానిరోజు 2015 బెస్ట్‌ ఫీచర్‌ ఫిల్మ్‌- కంచె 2015 ఉత్తమ బాలల చిత్రం -దానవీర శూరకర్ణ 2015 ఉత్తమ నటి అనుష్క(సైజ్‌ జీరో) 2015 ఉత్తమ దర్శకుడు (రాజమౌళి( బాహుబలి) 2015 ఉత్తమ హాస్యనటుడు- వెన్నెల కిశోర్‌ (భలే భలే మగాడివోయ్‌) 2015 ద్వితీయ ఉత్తమ చిత్రం- ఎవడే సుబ్రమణ్యం 2015 తృతీయ ఉత్తమ చిత్రం- నేను శైలజ 2015 ఉత్తమ మాటల రచయిత- సాయిమాధవ్‌( మళ్ళీ మళ్లీ ఇది రానిరోజు) 2015 ఉత్తమ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి 2016 ఉత్తమ చిత్రం పెళ్లిచూపులు 2016 ఉత్తమ నటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ 2016 ద్వితీయ ఉత్తమ చిత్రం- అర్ధనారి 2016 తృతీయ ఉత్తమ చిత్రం- మనలో ఒకడు 2014 ఎన్టీఆర్‌ జాతీయ అవార్డు - క‌మ‌ల్ హాసన్‌ 2014 నాగిరెడ్డి చక్రపాణి అవార్డు- ఆర్‌.నారాయణమూర్తి 2014 రఘుపతి వెంకయ్య అవార్డు- కృష్ణంరాజు 2014 స్పెషల్‌ జ్యూరీ అవార్డు- సుద్దాల అశోక్‌తేజ 2015 ఎన్టీఆర్‌ జాతీయ అవార్డు-కె.రాఘవేంద్రరావు 2016 ఎన్టీఆర్‌ జాతీయ అవార్డు- రజనీకాంత్‌ 2015 బీఎన్‌రెడ్డి జాతీయ అవార్డు- త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ 2016 బీఎన్‌రెడ్డి జాతీయ అవార్డు- బోయపాటి శ్రీనివాస్‌ 2016 రఘుపతి వెంకయ్య అవార్డు - చిరంజీవి