"పద్మావతి" కి నిరసనగా ఆందోళనలు


సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వంలో వస్తున్న వివాదాస్పద చిత్రం ‘పద్మావతి’ విడుదలకి వ్యతిరేకంగా ఆందోళనలు ఉధృతం అవుతున్నాయి. రాజస్థాన్‌లోని కోటా పట్టణంలో ఈ సినిమాకు వ్యతిరేకంగా కర్ణిసేన ఆకాష్ థియేటర్‌పై దాడి చేసి ధ్వంసం చేసింది. కర్ణిసేన కార్యకర్తలు కౌంటర్‌ అద్దాలను, కిటికిలను ధ్వంసం చేశారు. ఆకాశ్‌ థియేటర్‌లో తాజాగా ‘పద్మావతి’ సినిమా ట్రైలర్‌ను ప్రదర్శించడంతో ఆగ్రహించిన కార్యకర్తలు ఈ చర్యకు పాల్పడ్డారు. దీనికి సంబంధించి ఎనిమిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజస్థాన్‌ హోంమంత్రి గులాబ్‌ చంద్‌ కటారియా దీనిపై స్పందిస్తూ ప్రజాస్వామికంగా ఎవరైనా నిరసన తెలుపవచ్చని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే మాత్రం చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సినిమాలో చరిత్రను వక్రీకరించారని, పద్మావతి రాణి కథను వక్రీకరించారని రాజ్‌పుత్‌లు ఆగ్రహంతో ఉన్న సంగతి విదితమే. ఈ సినిమా విడుదల కాకుండా చూడాలని కోరుతూ హర్యానా మంత్రి విపుల్‌ గోయెల్‌ ఇదివరకే కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రి స్మృతి ఇరానీకి లేఖ రాశారు. డిసెంబర్‌ 1న ఈ చిత్రం విడుదలకు నిర్ణయించారు. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో కూడా కర్ణిసేన ఆధ్వర్యంలో ఈ సినిమాకు వ్యతిరేకంగా ఆందోళన జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సభలో దాదాపు లక్ష మంది రాజ్‌పుత్‌ వర్గీయులు పాల్గొన్నారు. ఈ చిత్రంలో రాణీ పద్మిని, అల్లావుద్దీన్‌ ఖిల్జీల మధ్య ఓ ప్రేమగీతాన్ని చిత్రీకరించారని ఆరోపిస్తూ కర్ణిసేన మండిపడుతున్నది.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం 

EDITOR: Deekshitula Subrahmanyam

D.NO.23-19-50, Haripuram,

Rajahmundry, Andhra Pradesh 533105, India

@ Ira News Paper Copyright 2017

Ira News Paper

eMail: iranewspaper@gmail.com

Mobile no.94404 51836

  • iranewspaper
  • iranewspaper
  • Facebook Basic Square
  • Twitter Basic Square
  • Google+ Basic Square
 Follow Us