పదేళ్లలో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్


వచ్చే పదేళ్లలో ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ అవతరిస్తుందని బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా మెరిల్‌ లించ్‌ ఒక రిపోర్టులో అంచనా వేసింది. 2028 కల్లా భారత్‌ జపాన్‌ను కూడా జీడీపీని అధిగమిస్తుందని ఆ నివేదిక చెప్పింది. కాగా, ఇప్పటికే బ్రిక్స్‌ దేశాల్లో బ్రెజిల్‌, రష్యాలను వెనక్క నెట్టి భారత్‌ రెండో స్థానానికి చేరిన సంగతి తెలిసిందే. 2019 కల్లా ఫ్రాన్స్‌, బ్రిటన్‌లను దాటి ప్రపంచంలో ఐదో శక్తిమంతమైన దేశంగా భారత్‌ అవతరిస్తుందనే అంచనాలు ఉన్నాయి. 2028 కల్లా జర్మనీ, జపాన్‌లను కూడా భారత్‌ జీడీపీలో అధిగమిస్తుందని బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా మెరిల్‌ లించ్‌ తన రిపోర్టులో పేర్కొంది. వచ్చే పదేళ్లలో భారత్‌ జీడీపీ 10 శాతం పెరుగుతుందని వెల్లడించింది. ‘ఇండియా 2028 : ది లాస్ట్‌ బ్రిక్‌ ఇన్‌ ది వాల్‌’ అనే పేరుతో రిపోర్టును బయటకు విడుదల చేసింది.

ముఖ్యాంశాలు