పవన్ కళ్యాణ్ కు గ్లోబల్ ఎక్సలెన్స్ అవార్డు


జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌కు ‘గ్లోబల్‌ ఎక్సలెన్స్‌ అవార్డు’ లభించింది. ఇండియా, యూరోపియన్‌ బిజినెస్‌ ఫోరం (ఐ.ఇ.బి.ఎఫ్‌) ఈ అవార్డును ఆయనకు ప్రదానం చేయనుందని జనసేన పార్టీ తెలిపింది. ఈనెల 16న పవన్ లండన్ వెళ్లి 17, 18 తేదీల్లో అక్కడ జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. వెస్ట్‌ మినిస్టర్‌ పోర్టుక్యూలిస్‌ హౌస్‌ ఆఫ్‌ పార్లమెంట్‌, బ్రిటన్‌ పార్లమెంట్‌ హౌస్‌ ఆఫ్‌ లార్డ్స్‌లో జరగనున్న సభలలో పవన్‌ పాల్గొంటారు. 18న యూరప్‌లోని వివిధ యూనివర్శిటీలకు చెందిన విద్యార్థులతో వెస్ట్‌ మినిస్టర్‌ ఎడ్యుకేషన్‌ సెంటర్‌లోని కింగ్స్‌ మెడికల్‌ కళాశాలలో సమావేశం అవుతారు.

ముఖ్యాంశాలు