బిల్ గేట్స్ మార్కు మహానగరానికి సన్నాహాలు


మైక్రోసాఫ్ట్‌ స్థాపకుడు, ప్రపంచ అగ్రశ్రేణి సంపన్నుడు బిల్‌గేట్స్‌ అత్యాధునిక సాంకేతిక హంగులతో ఓ కొత్త మహా నగర నిర్మాణానికి సిద్ధమవుతున్నారు. బిల్‌గేట్స్‌ పెట్టుబడులు పెట్టిన ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ అమెరికాలోని ఆరిజోనా రాష్ట్రంలోని మారుమూల ప్రాంతంలో ఈ నగర నిర్మాణం కోసం నీటి సదుపాయం కూడా లేని 25 వేల ఎకరాల భూములను సుమారు 523.7 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. బెల్‌మోంట్‌ పేరుతో నిర్మించే ఈ నగరం భవిష్యత్తు సాంకేతిక వైభవానికి ప్రతీకగా ఉంటుందని అంటున్నారు. దీని నిర్మాణం, అభివృద్ధి, నిర్వహణ బాధ్యతలను బెల్‌మోంట్‌ పార్టనర్స్‌ సంస్థ చేపట్టనుంది. మీడియా సంస్థ కేపీఎన్‌ఎక్స్‌ వెల్లడించిన సమాచారం ప్రకారం ఈ టౌన్ షిప్ లో 80 వేల గృహాలు, 3,800 ఎకరాల్లో పరిశ్రమలు, కార్యాలయాలు, 470 ఎకరాల్లో పాఠశాలలు ఉంటాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, అత్యధిక సాంకేతిక సమాచార వ్యవస్థలు, కేంద్రాలు, సరికొత్త తయారీ, సొంతంగా నడిచే కార్లు ఉంటాయి.

ముఖ్యాంశాలు