మహేష్ కు మరో నంది


ఏపీ ప్రభుత్వం ప్రకటించిన నంది పురస్కారాల జాబితాలో 2015 సంవత్సరానికి ఉత్తమ నటుడు అవార్డు మహేష్ బాబుకి దక్కింది. శ్రీమంతుడు చిత్రానికి గాను ఆయనను ఈ పురస్కారం వరించింది. ఊరిని దత్తత తీసుకోవాలనే ఉన్నతఆశయంతో ‘శ్రీమంతుడు’ చిత్రం తెరకెక్కింది. తొలి చిత్రం ‘రాజకుమారుడు’తో మొదటి సారిగా నంది పురస్కారం (ఉత్తమ అరంగేట్రం..) అందుకున్న మహేష్‌కు.. 2002లో ‘మురారి’, 2003లో ‘టక్కరిదొంగ’, 2005లో ‘అర్జున్‌’ చిత్రాలకు స్పెషల్‌ జ్యూరీ కేటగిరీలో అవార్డులు వచ్చాయి. 2004లో ‘నిజం’, 2006లో ‘అతడు’, 2012లో ‘దూకుడు’ చిత్రాలకు గాను ‘ఉత్తమ నటుడు’గా నంది అవార్డులను అందుకున్నారు. ఇది అతడికి ఎనిమిదో నంది.

ముఖ్యాంశాలు