ముగిసిన సోదాలు .. శశి అండ్ కో అక్రమాస్తులు 15 వందల కోట్లు


తమిళనాడులో జయ స్నేహితురాలిగా పేరున్న శశికళ బంధువులు, సన్నిహితుల నివాసాల్లో అయిదు రోజుల పాటు జరిగిన ఐటీ సోదాలు ముగిసాయి. 187 ప్రాంతాల్లో సమూలంగా, ఇక కాలంలో జరిగిన ఈ తనిఖీలు సోమవారం నాటికీ సుమారు పది ప్రాంతాల్లో మాత్రమే జరిగాయి. శశికళ మేనల్లుడిని ఐటీ అధికారులు విచారణ కోసం అదుపులోకి తీసుకున్నారు. సోదాల్లో శశికళ బంధువులు, సన్నిహితులకు సంబంధించి ఆదాయ వివరాలు వెల్లడించని మొత్తం రూ.1,430 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించారు. వీరికి చెందిన 18 కంపెనీల్లో లభించిన పత్రాల ఆధారంగా ఈ వివరాలు తెలిసాయి. రూ.5 కోట్ల విలువైన నగలు, రూ.7 కోట్ల నగదు కూడా స్వాధీనం చేసుకున్నారు. ‘ఆపరేషన్‌ క్లీన్‌ మనీ’ పేరిట మన్నార్ గుడి మాఫియా లక్ష్యంగా 9న భారీస్థాయిలో ఈ సోదాలు మొదలయ్యాయి. చెన్నైలోని జయ టీవీ కార్యాలయం, జయ టీవీ సీఈవో వివేక్‌ (శశికళ మేనల్లుడు) నివాసం, శశికళ మేనకోడలు కృష్ణప్రియ నివాసం, మిడాస్‌ మద్యం కంపెనీ, జయలలిత కుటుంబ వైద్యుడు డాక్టర్‌ శివకుమార్‌ (టీటీవీ దినకరన్‌ తోడల్లుడు) నివాసం, శశికళకు చెందిన నీలగిరి జిల్లా కొడనాడులోని గ్రీన్‌ టీ ఎస్టేట్‌ ఐదు రోజులు వరుసగా తనిఖీలు జరిగిన వాటిలో ఉన్నాయి. భారీగా బంగారం, వజ్రాలు, ఆస్తుల పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో బినామీ ఆస్తులు అధికం అని తెలుస్తోంది. రద్దయిన పాత పెద్దనోట్లు, 3 కిలోల బంగారం లభించినట్లు సమాచారం.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం