అజ్ఞాత వాసి కోసం రంగస్థలం వెనక్కి!


రామ్ చరణ్ తేజ్ సినిమా రంగస్థలం.. సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సి ఉంది. అయితే అదే సమయానికి బాబాయ్ పవన్ కళ్యాణ్ చిత్రం అజ్ఞాతవాసి రిలీజ్ అవుతుండడంతో ... అంతర్గత ఒప్పందంప్రకారం అబ్బాయ్ చరణ్ సినిమా విడుదల వాయిదా పడింది. బాబాయ్‌ - అబ్బాయ్‌ల మధ్య పోటీ ఎందుకన్నది దర్శక నిర్మాతల ఆలోచనట. అందుకే ‘రంగస్థలం’ పోటీ నుంచి తప్పుకొందని తెలుస్తోంది. అయితే ఫిబ్రవరి చివరి వారంలో రంగస్థలం విడుదల అవుతుంది. ఈ చిత్రంలో చరణ్ ఒక పల్లెటూరి వేషం కడుతున్నాడు. పాతికేళ్ల గతంలోకి తీసుకెళ్లే కథతో ఈచిత్రం సిద్ధమవుతున్నది.

ముఖ్యాంశాలు