అమెరికాలో మన కంపెనీల హవా

భారత్‌కు చెందిన సుమారు 100 కంపెనీలు అమెరికాలో ఏడాదికి 18  బిలియన్‌ డాలర్లు పెట్టుబడులు పెడుతుండగా అవి 1,13,000 ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు ఇండియన్‌ కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ(సీఐఐ) విడుదల చేసిన తాజా నివేదిక వెల్లడించింది. ‘ఇండియన్‌ రూట్స్‌.. అమెరికన్‌ సాయిల్‌’ పేరుతో ఈ నివేదిక విడుదలయింది.  అలాగే భారత్‌ యూఎస్‌లో కార్పొరేట్‌ సామాజిక బాధ్యత కింద 147 మిలియన్‌ డాలర్లు, పరిశోధన, అభివృద్ధి కింద 588 మిలియన్‌ డాలర్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపింది. అమెరికాలోని రాష్ట్రాల్లో భారత కంపెనీలు పెడుతున్న పెట్టుబడులు సగటున 187 మిలియన్‌ డాలర్లు. వచ్చే ఐదేళ్లలో 87శాతం కంపెనీలు స్థానికంగా ఉన్న తమ ఉద్యోగుల సంఖ్యను పెంచుకోవాలని కూడా  యోచిస్తున్నాయి. భారత నిపుణులు, పరిశ్రమలు యూఎస్‌ ఆర్థికవ్యవస్థకు ఎంతగానో దోహదపడుతున్నాయని ఆ నివేదిక పేర్కొంది. 

Facebook
Twitter