కుంభమేళా... త్రిసూర్ పురం ఉత్సవాలపై దాడులకు కుట్ర


లాస్‌వెగాస్‌ తరహా దాడులతో భారత్‌ పై విరుచుకుపడతామని అంతర్జాతీయ ఉగ్ర సంస్థ ఇస్లామిక్‌ స్టేట్‌ (ఐఎస్‌) ఆడియో క్లిప్స్ లో హెచ్చరించింది. వచ్చే కుంభమేళా, త్రిసూర్‌పురంలో భారీ జనావాహినిపై అనూహ్య దాడులకు దిగుతామని పదినిమిషాల ఆడియో క్లిప్‌లో ఐఎస్‌ హెచ్చరించింది. మలయాళంలో మాట్లాడుతూ ఈ ఆడియో ఉంది. కుంభమేళా, త్రిసూర్‌ పురం వంటి ఉత్సవ వేడుకలే తమకు లక్ష్యమని స్పష్టం చేసింది. భారత్‌లో ఉగ్ర దాడి అనివార్యమని, అది ఖురాన్ ఆదేశమని ఆడియో క్లిప్‌లో పేర్కొన్నారు. లాస్‌వెగాస్‌ కాల్పులకు పాల్పడినది తమ మనిషేనని... ఐఎస్‌ పేర్కొంది. విషం కలిపిన ఆహారం ఇవ్వండి...ట్రక్‌లు ఉపయోగించండి..త్రిసూర్‌పురం లేదా మహా కుంభమేళాపై వందలాదిమందిని చంపడం కోసం మీ మేధాశక్తిని ఉపయోగించండి.. అంటూ ఆ ఆడియో క్లిప్‌లో ఉగ్రవాదులకు పిలుపునిచ్చారు. కనీసం రైలు పట్టాలు తప్పేలా చుడండి.. అదీ కాదంటే కత్తులతో జనం పై పడి నరకండి అని ఆడియో క్లిప్ లో మాట్లాడిన వ్యక్తి ఉద్బోధించాడు. ఆప్ఘనిస్తాన్‌ నుంచి టెలిగ్రాం మెసెంజర్‌ను ఆడియో క్లిప్‌గా మార్చారని పోలీసులు దీన్ని పరిశీలించి చెబుతున్నారు.ఇందులో ఉన్న గొంతు ఐఎస్‌ నేత రషీద్‌ అబ్దుల్లాదిగా చెబుతున్నారు. అబ్ధుల్లాపై పలు సెక్షన్ల కింద ఎన్‌ఐఏ చార్జిషీట్‌ రూపొందించింది. ఈ టేప్ వినడంతోనే నిఘా వర్గాలు, పోలీసు శ్రేణులు అప్రమత్తమయ్యాయి.

ముఖ్యాంశాలు