ధఢక్ చిత్రంతో శ్రీదేవి కూతురు తెరంగేట్రం


ఒకప్పటి అందాల తార శ్రీదేవి కుమార్తె జాన్వి తెరంగేట్రం గురించి కొన్ని రోజులుగా అనేక వార్తలు రాగా, రాగా చివరికి సస్పెన్స్ లోనే జాన్వి తొలి చిత్రం ఫస్ట్‌లుక్‌ విడుదలైంది. ఇది శ్రీదేవి అభిమానులకు పెద్ద సర్ప్రైజ్. ఈ చిత్రం పేరు ‘ధడక్‌’. ఘానా విజయం సాధించిన మరాఠీ చిత్రం ‘సైరాత్‌’కు హిందీ రీమేక్‌ ఇది. ఫస్ట్‌లుక్‌లో జాహ్నవి ని అచ్చం తల్లి శ్రీదేవిలా చూపించే ప్రయత్నంచేసారు. విశాలమైన కళ్లు, అందమైన మొహంతో జాహ్నవి తల్లి పోలికలతోనే కనిపించింది. ప్రస్తుతం ఈ ప్రచార చిత్రాలు సోషల్‌మీ డియాలో హల్చల్ చేస్తున్నాయి. శశాంక్‌ ఖైతాన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ధర్మా ప్రొడక్షన్స్‌, జీ స్టూడియో సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. జాన్వికి జోడీగా హీరో షాహిద్‌ కపూర్‌ తమ్ముడు ఇషాన్‌ ఖత్తర్‌ నటిస్తున్నాడు. జులై 6న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుందట. కాగా జాన్వి న్యూయార్క్‌లో ఫిల్మ్‌ ఇన్సిట్యూషన్‌లో శిక్షణ తీసుకున్నారు. ఇటీవల శ్రీదేవి తన కుమార్తె గురించి మాట్లాడుతూ ‘భవిష్యత్తుపై పిల్లలకు ఓ ప్రణాళిక ఉంటుంది. అందుకే జాన్వి పని విషయంలో సలహాలు ఇవ్వను. తన కృషి,, ఎంపికతో ఆమెకు ఆమెగానే ముందడుగు వేయాలి’ అని అన్నారు.