రాహుల్ ని పప్పు అంటే తప్పే !


కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీని ప్రచార కార్యక్రమాల్లో ‘పప్పు’ అని సంబోధించడం తప్పని పేర్కొంటూ గుజరాత్‌ ఎన్నికల కమిషన్‌ ఆ పదాన్ని నిషేధించింది. ఎన్నికల ప్రచార సందర్భంగా ఓ ఎలక్ట్రానిక్‌ ప్రచార కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ(బీజేపీ) రాహుల్‌ను ఉద్దేశించి ’పప్పు’ అని వాడుతూ ఆ స్క్రిప్ట్ ని ఈసీకి పంపింది. స్క్రిప్టు పరిశీలించిన కమిషన్‌ కమిటీ ‘పప్పు’ అనే పిలుపు అభ్యంతకరం అని, అది ఆయన్ను అవమానించడమేనని పేర్కొంది. గుజరాత్‌ బీజేపీ దీనిపై స్పందిస్తూ ప్రకటనలో వాడిన స్క్రిప్ట్ ఏ ఒక్క నాయకుడినో ఉద్దేశించి కాదని చెప్పింది. ప్రచార కార్యక్రమాల స్క్రిప్టును ముందుగానే గుజరాత్‌ ఎన్నికల కమిషనర్‌ ఆధ్వర్యంలో ఉండే మీడియా కమిటీకి అందజేస్తామని తెలిపాయి. అయితే కమిటీ సూచనల మేరకు త్వరలోనే కొత్త స్క్రిప్టును ఈసీకి అందజేస్తామని పేర్కొంది.

ముఖ్యాంశాలు