ఓటీపీతో ఆధార్ -మొబైల్ నంబర్ అనుసంధానం


మొబైల్‌ నెంబరుకు ఆధార్‌ అనుసంధాన ప్రక్రియ సరళతరం అయ్యే విధానం అమల్లోకి వస్తున్నది. టెలికాం సంస్థల సేవా కేంద్రాలకు వెళ్లే అవసరం లేకుండా ఓటీపీ (వన్‌ టైం పాస్‌వర్డ్‌) సాయంతో ఈ ప్రక్రియను పూర్తి చేసుకోగల్గడం ఇందులోని ప్రత్యేకత. ఆధార్‌ అనుసంధానంలో ప్రస్తుత చందాదార్ల సిమ్‌ల పునఃపరిశీలనకు (రీవెరిఫికేషన్‌) అనుసరించే కొత్త మార్గాలపై టెలికాం కంపెనీలు సమర్పించిన బ్లూప్రింట్‌ కు యూఐడీఏఐ ఆమోదం తెలిపింది. డిసెంబరు 1 నుంచి ఈ కొత్త మార్గాలను అనుసరించేందుకు అనుమతి లభించింది. మొబైల్‌ నెంబరుకు ఆధార్‌ అనుసంధాన ప్రక్రియను సులభం చేయడంలో భాగంగా ఓటీపీ, యాప్‌ లేదా ఐవీఆర్‌ఎస్‌ లాంటి మార్గాలను గత నెలలో ప్రభుత్వం ప్రకటించింది. అయితే వీటి అమలు ప్రణాళికను యూఐడీఏఐకు సమర్పించాలని టెలికాం కంపెనీలకు సూచించింది. భద్రత, ప్రమాణాలు, గోప్యత, ఆధార్‌ చట్టం అంశాలను పరిగణనలోకి తీసుకొని టెలికాం కంపెనీల బ్లూప్రింట్‌కు అనుమతి ఇచ్చారు. మొబైల్‌ నెంబర్లన్నింటికీ ఆధార్‌ అనుసంధానాన్ని నిర్దేశిత గడువులోపే (ఫిబ్రవరి 6) పూర్తి చేసేందుకు ఈ కొత్త మార్గాలు ఉపకరించి మొబైల్‌ నెంబర్ల దుర్వినియోగం అదుపులోకి వస్తుంది. దీనితో పాటుగా కంపెనీల సేవా కేంద్రాల్లోనూ రీవెరిఫికేషన్‌ ప్రక్రియ సేవలు కొనసాగుతాయి.

ముఖ్యాంశాలు