కమల్ కలం దురదకి సరదా తీరింది!


ప్రముఖ తమిళ నటుడు కమల్‌ హాసన్‌ చేసిన హిందూ ఉగ్రవాద వ్యాఖ్యలపై మద్రాస్‌ హైకోర్టు ఆగ్రహించింది. ఈ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా దాఖలైన ఓ పిటిషన్‌ ను హై కోర్టు గురువారం విచారణకు స్వీకరించింది. వెంటనే కమల్ పేరు చేర్చి ఎఫ్‌ఐఆర్‌ వేయాలని తమిళనాడు పోలీసులను ఆదేశించింది. కమల్‌ అనుచిత వ్యాఖ్యలు మొతం హిందూ సమాజాన్నిఉగ్రవాదులుగా అభివర్ణించేలా ఉందంటూ అడ్వొకేట్‌ క్లర్క్‌ జీ దేవరాజన్‌ కోర్టులో పిటిషన్‌ వేశారు. మతపరమైన వ్యాఖ్యలతో తమిళ జాతిని విడగొట్టేందుకు కమల్ కుట్ర చేసారని పిటిషనర్‌ ఆరోపించారు. కమల్‌ రాసిన ఈ తప్పుడు వ్యాసాన్ని ప్రచురించిన పత్రిక యాజమాన్యంపై కూడా చర్యలు తీసుకోవాలని దేవరాజన్‌ కోరారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న కోర్టు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. కేసు వచ్చే వారానికి వాయిదా వేసింది. ఆనంద వికటన్ పత్రికకు రాసిన ప్రత్యేక వ్యాసంలో హిందు ఉగ్రవాదాన్ని అరికట్టడంలో తమిళనాడు సహా దేశంలోని ప్రభుత్వాలన్నీ విఫలమయ్యాయని, కేరళ మాత్రం సక్రమంగా వ్యవహరించిందని పేర్కొంటూ కమల్ అనుచిత వ్యాఖ్యలకు పాల్పడ్డారు. అయితే దీని తర్వాత నవంబర్ 7న తన పుట్టినరోజు సందర్భంగా యాప్‌ ఆవిష్కరణలో పాల్గొన్నప్పుడు అయన ఈ వ్యాసాన్ని ప్రస్తావిస్తూ తాను హిందువుల మనోభావాలను దెబ్బతీసే పని చెయ్యబోనని అన్నారు. తనను తప్పుగా అర్థం చేసుకున్నారని వాపోయారు.

ముఖ్యాంశాలు