చర్చలకు సిద్ధం అంటూ పాక్ కొత్త ఎత్తు


అంతర్జాతీయ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి..కొత్తసమీకరణలు ఆవిర్భవిస్తు న్నాయి... ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌ వైఖరిలో ఏదో మార్పు కనిపిస్తున్నది. ఇది ఒత్తిడికి తలొగ్గదామా లేక కొత్త ఎత్తా అనేది చెప్పలేము. ఆసియాన్ లో చతుర్భుజ కూటమి ఏర్పాటుతో ఆసియాలో భారత్‌ నిజంగానే పెద్దన్న పాత్ర పోషణకి రంగం సిద్ధమైంది. దీంతో అనివార్యంగా పాకిస్తాన్‌ వెనక్కి తగ్గినట్టు గోచరిస్తుంది. కశ్మీర్‌ సహా పలు వివాదాస్పద అంశాలపై భారత్‌తో చర్చలకు తాము సిద్ధమంటూ పాకిస్తాన్‌ గురువారం ప్రకటించింది. కశ్మీర్‌, సియాచిన్‌, సిర్‌క్రీక్‌ వంటి వివాదాస్పద అంశాలపై చర్చలు పునఃప్రారంభించేందుకు తాము సిద్ధం అని పాకిస్తాన్‌ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మహమ్మద్‌ ఫైసల్‌ బుధవారం ప్రకటించారు. చర్చలకు మేం సిద్ధంగా ఉన్నాం, భారత ప్రతిస్పందన కోసం ఎదురు చూస్తున్నామని అయన అన్నారు. పాకిస్తాన్‌ సైనిక చట్టాల ప్రకారం మిలటరీ కోర్టు ఉరిశిక్ష విధించాక, ఆ దోషిని ఎవరినీ కలిసేందుకు అనుమతించం, అయితే మానవతా దృష్టితో కులభూషణ్ జాదవ్‌ను కలిసేందుకు అతడి భార్యకు అనుమతి ఇచ్చామన్నారు.

ముఖ్యాంశాలు