దేశవ్యాప్తంగా మోదీ కి తిరుగులేని ప్రజా మద్దతు


ఈ సంవత్సరం ఫిబ్రవరి 21 నుంచి మార్చ్ 10 వరకు అమెరికా కి చెందిన ప్రసిద్ధ సర్వే సంస్థ పిఇడబ్ల్యు భారత దేశాల్లో ఒక సర్వే నిర్వహించింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ దేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ తిరుగు లేని శక్తిమంతమైన నేతగా ఆవిర్భవించారని ఈ సర్వే ప్రకారం తేలింది. ప్రజా సానుకూలత, విశ్వాసం, ఆర్థిక వ్యవస్థ పునరు జ్జీవనానికి తీసుకుంటున్న చర్యలపై భరోసా వంటి అంశాలే ప్రాతిపదికగా ఈ సర్వే జరిగింది. ఇందులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అత్యధికంగా 88 శాతం ప్రజామద్దతు తో నంబర్ వన్ గా నిలిచారు. ఆయనకు దరిదాపుల్లో మరే నాయకుడు, నాయకురాలు లేకపోవడం విశేషం. సోనియా గాంధీకి 57 శాతం, రాహుల్ గాంధీకి 58 శాతం, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కి 38 శాతం ప్రజామద్దతు లభించింది. దేశాన్ని నాలుగు ప్రాంతీయ విభాగాలుగా విభజించి చేసిన ఈ సర్వే లో చెప్పిన విషయాలు మోదీ అభిమానులకు పండగ కాగా.. వ్యతిరేకులకు చేదు మాత్రే. నార్త్ (ఉత్తర భారతం) లో 84 శాతం, తూర్పు భారతంలో 85 శాతం, పశ్చిమ భారతంలో 92 శాతం, దక్షిణ భారతంలో 95 శాతం ప్రజలు మోదీ ని అంగీకరిస్తున్నారని ఈ సర్వే లో తేలింది. దీనికి సగటు 88 శాతం కావడంతో దేశవ్యాప్తంగా మోదీ కి 88 శాతం ప్రజామద్దతు ఉందని నిర్ధారించారు.

ముఖ్యాంశాలు