"పద్మావతి" కి అడ్డు పడేలా యుపి ప్రభుత్వ లేఖ


‘పద్మావతి’ చిత్రంపై నిరసనల నేపథ్యంలో.. ఆ చిత్రానికి సీబీఎఫ్‌సీ ధ్రువీకరణ పత్రాన్ని ఇచ్చే ముందు ప్రజల ఆగ్రహాన్ని దృష్టిలో ఉంచుకోవాలని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం లేఖ రాసింది. పద్మావతి చరిత్ర సమాచారాన్ని కూడా సెన్సార్‌ బోర్డుకు ఇవ్వాలని సూచించింది. ఈ సినిమా విడుదలకు వ్యతిరేకంగా దిష్టిబొమ్మల దహనం, నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయని యూపీ హోంశాఖ అధికారి అరవింద్‌ కుమార్‌ ఆ లేఖలో పేర్కొన్నారు. నవంబర్‌ 22, 26, 29 తేదీల్లో యూపీ స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబరు 1న కౌంటింగ్‌ ఉంటుంది. ఈ కీలక సమయంలో పద్మావతి విడుదల కారణంగా రాష్ట్రంలో శాంతి, భద్రతలు అదుపుతప్పే ప్రమాదం ఉందని ఆయన లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. సంజయ్‌ లీలా బన్సాలీ తీసిన పద్మావతి చిత్రంపై రాజ్‌పుత్‌ లు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.