బంగాళాదుంప వేయండి... బంగారం తీసుకోండి!

కొందరు తమ సంభాషణల్లో హాస్యం పండించడానికి చాలా కష్టపడతారు... కానీ కొందరు మాట్లాడితే చాలు హాస్యమే హాస్యం! కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ రెండో కోవలో చేరతారు. గతంలో బెంగళూరులో ‘ఇందిరా క్యాంటీన్లు’ ప్రారంభించిన సమయంలో రాహుల్ ప్రసంగిస్తూ క్యాంటీన్లకు బదులు క్యాంపెయిన్ అన్నారు. బెంగళూరులోని అన్ని ప్రాంతాల్లో పెడుతున్నాం అనడానికి బదులుగా అన్ని రాష్ట్రాల్లో అనినోరు జారారు. తాజాగా రాహుల్ ప్రసంగానికి చెందిన వీడియో ఒకటి సోషల్మీడియాలో వైరల్ అవుతోంది. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ అహ్మదాబాద్లో ప్రసంగిస్తూ చేసిన వ్యాఖ్యలు చిత్రాతి విచిత్రం. ‘బంగాళాదుంపల్ని మెషిన్ లో వేస్తె బంగారం ముద్దలు వస్తాయని అయన అన్నారు. ఒకసారైతే పొరపాటు అనుకోవచ్చు. రెండుసార్లు ఇదే విషయాన్నీ ఆయన నొక్కి చెప్పారు. దీని వల్ల రైతులకు బాగా డబ్బులు వస్తాయి.. ఏమి చేసుకోవాలో కూడా అర్థం కాదు’ అని అనడంతో సభ అవాక్కయింది. గతంలో ఉత్తర్ప్రదేశ్ రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన మామిడి పండ్లను తయారు చేసే యంత్రాలు తయారు చేస్తానని వాగ్దానం చేసారు!