96 మంది ఎగవేతదార్లు.. రూ.3,614.14 కోట్లు బకాయి


ఆదాయపు పన్ను శాఖ ఎంత బలహీనంగా ఉందో చూడాలంటే ఈ కేసులవివరాలు తెలియాలి. దేశం మొత్తమ్మీద 96 మంది పన్ను ఎగవేతదార్లు ఉన్నారు. వీళ్ళు నిన్న మొన్నా కాదు.. 1980 నుంచి పన్ను కట్టకుండా ఎగవేస్తున్నారు.. ఇప్పటికి వీరి బకాయి సొమ్ము రూ.3,614.14 కోట్లు. ఐటీ అధికారులు వీళ్ళదగ్గరనుంచి కనీసం ఒక్క రూపాయి కూడా వాసులు చేయలేకపోయారంటే ఆశ్చర్య పోవద్దు..ఇది నిజం! దేశవ్యాప్తంగా పన్ను ఎగవేతదార్లు అధికంగా ఉన్న నగరాల్లో హైదరాబాద్‌ మొదటి స్థానంలో ఉంది. హైదరాబాద్‌లో ఎగవేతదార్ల సంఖ్య 25 అయితే ఆ ఆతర్వాతి స్థానం గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌ ది. ముంబయికి చెందిన ఉదయ్‌ ఆచార్య ఐటీ శాఖకు రూ.779.04కోట్ల పన్ను బకాయి. కానీ, ఇప్పుడు అతను మరణించాడు. అధికారులు పన్ను బకాయిలకు ఉదయ్‌ కుటుంబాన్ని కలిస్తే అతని బ్యాంక్‌ ఖాతాలో ఒక్క రూపాయి కూడా లేదని చూపించారు. ఉదయ్‌ లాంటి (బాధ్యులు మరణించిన) కేసులు దేశంలో 69 ఉంటే వారిలో 24 మంది బ్యాంకు ఖాతాలు ఖాళీగా ఉన్నాయి. అయితే వారి వారసులు దర్జాగా సంపన్న జీవితాలే వెలగబెడుతున్నారు.కానీ బాకీ అడిగితే మాత్రం.. మాకేం సంబంధం లేదంటారు! 96

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం