అమరావతికి హరిత ట్రైబ్యునల్ అనుమతి


రాజధాని అమరావతి నిర్మాణానికి జాతీయ హరిత ట్రైబ్యునల్‌ అనుమతి లభించింది. రాజధాని నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన నాలుగైదు పిటిషన్లపై విచారించిన ఎన్జీటీ శుక్రవారం తుదితీర్పు వెలువరిస్తూ అమరావతిలో పర్యావరణానికి హాని చేస్తున్నారనే ఆరోపణలను తోసిపుచ్చింది. పర్యావరణ శాఖ 191 నిబంధనలను అమలుచేస్తూనే నిర్మాణాలు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి నిర్దేశించింది. కొండవీటి వాగు దిశ మార్చినా ప్రవాహానికి ముప్పు లేకుండా చూడాలని, కృష్ణా నది ప్రవాహానికి అడ్డంకులు సృష్టించవద్దని ఆదేశించింది. అమరావతిలో నిర్మాణాల పర్యవేక్షణకు రెండు కమిటీలను ట్రైబ్యునల్ నియమించింది.

ముఖ్యాంశాలు