ఆసియాలో అగ్ర కుబేరుడు .. ఇదీ అంబానీ ఘనత!


రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ కుటుంబం ఆసియా ఖండంలో అత్యంత సంపన్న కుటుంబం గా నిలిచింది. శామ్‌సంగ్‌ లీ కుటుంబాన్ని అధిగమించి అంబానీ ఈ స్థానాన్ని చేజిక్కించుకున్నారు. ఆసియాలోని అత్యుత్తమ 50 సంపన్న కుటుంబాల జాబితాని ఫోర్బ్స్‌ రూపొందించింది. దీని ప్రకారం ముకేశ్‌ అంబానీ కుటుంబ సంపద 4480 కోట్ల డాలర్ల (సుమారు రూ.3 లక్షల కోట్లు)కు చేరింది. 4080 కోట్ల డాలర్ల సంపదతో శాంసంగ్ లీ కుటుంబం రెండో స్థానంలో, ఆసియాలోనే రియల్ ఎస్టేట్ రంగంలో పేరు గడించిన క్వోక్‌ కుటుంబం (హాంకాంగ్‌) 4040 కోట్ల డాలర్ల తో మూడో స్థానంలో ఉన్నాయి. ఆసియా లోని టాప్ టెన్ అత్యంత శ్రీమంతుల కుటుంబాల్లో భారత్‌ నుంచి అంబానీలకు మాత్రమే చోటు దక్కింది. భారత్‌ నుంచి అత్యధికంగా 18 కుటుంబాలు ఈ టాప్ 50 లో చోటు చేసుకున్నాయి. మూడేళ్లుగా భారత సంపన్న కుటుంబాలు ఈ ఘనత సాధిస్తున్నాయి. ఈ జాబితాలోని 50 కుటుంబాల మొత్తం సంపద 69 ,900 కోట్ల డాలర్లు. అంబానీతో పాటు ప్రేమ్ జీ, హిందుజా, మిట్టల్, మిస్టరీ, బిర్లా, గోద్రెజ్, బజాజ్, జిందాల్, బర్మన్, లాల్ ,వాడియా తదితరులు టాప్ 50 లో ఉన్నారు.

ముఖ్యాంశాలు