బాణం గుర్తు నితీష్ కే!


జనతాదళ్‌(యునైటెడ్‌) పార్టీ గుర్తు బాణం, అలాగే పార్టీ కూడా బిహార్‌ సీఎం నితీశ్‌కుమార్‌కు చెందుతాయని ఎన్నికల కమిషన్‌(ఈసీ) శుక్రవారం స్పష్టం చేసింది. జేడీయూ పార్టీ తమదేనని, పార్టీ గుర్తు కూడా తమకే కేటాయించాలని కోరుతూ శరద్‌యాదవ్‌, నితీశ్‌కుమార్‌ వర్గీయులు గతంలో ఈసీని ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఆయా నేతల బలాబలాలను పరిశీలించిన అనంతరం ఈసీ బాణం గుర్తు, పార్టీ నితీశ్‌కే చెందుతాయని తెలిపింది. జేడీయూ నేతల్లో ఎక్కువ మంది నితీశ్‌కే మద్దతు తెలపడంతో పార్టీని, గుర్తును ఆయనకే కేటాయిస్తున్నట్లు ఈసీ స్పష్టం చేసింది.

ముఖ్యాంశాలు