సామాన్యులకూ శ్రీవారి శీఘ్ర దర్శనం


శ్రీవేంకటేశ్వరస్వామి సర్వదర్శనం విధానంలో సామాన్యులకు శీఘ్ర దర్శనం లభించేలా కొత్త మార్పులు తీసుకు వస్తున్నారు. ఇందుకు తితిదే ఒక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసింది. డిసెంబరు రెండో వారంలో తితిదే ప్రయోగాత్మకంగా చేపట్టే ఈ విధానంతో సామాన్యులకు అనేక గంటల తరబడి నిరీక్షణ బాధలు తప్పవచ్చని భావిస్తున్నారు. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులకు, తిరుమలకు కాలినడక భక్తులకు (దివ్యదర్శనం) 2-3 గంటల్లో శ్రీవారి దర్శనం లభిస్తోంది. ఇదే విధానం సర్వదర్శనం లోనూ ఉండాలనేది ఈ ప్రణాళిక ఆంతర్యం. తిరుమల దివ్యక్షేత్రంలో 21 ప్రాంతాలతో పాటు కాలినడక మార్గాల్లో 150 కౌంటర్లు ఏర్పాటు చేసి వాటిలో బార్‌కోడింగ్‌ టోకెన్లను భక్తులకు ఉచితంగా జారీచేస్తారు. దీనికి ఆధార్‌కార్డును అనుసంధానం చేయాలని కూడా తితిదే నిర్ణయించింది. టోకెన్‌పై కేటాయించిన సమయానికి వైకుంఠం-2 ముఖద్వారం వద్దకు వెళితే లోపలి పంపుతారు. 2-3 గంటల్లోనే వీరికి స్వామి దర్శనం అయ్యే వీలుంటుంది. రాయితీపై రూ.20 ధరతో రెండు, అదనంగా కోరితే రూ.50 ధరకు మరో రెండు మొత్తం నాలుగు లడ్డూలకు టోకెన్‌ వర్తిస్తుంది. సర్వదర్శనం భక్తులకు కూడా శీఘ్ర దర్శనం కోసం చర్యలు టీఎసుకుంటున్నామని, దీనికి భక్తులు తమతో పాటు ఆధార్‌కార్డును తీసుకువచ్చి టోకెన్లు పొందాలని టీటీడి జెఇఓ కెఎన్ శ్రీనివాసరాజు తెలిపారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం