కేంద్రం మాట పెడచెవిన... పోలవరానికి మళ్ళీ టెండర్లు


కేంద్రం చెప్పినా పట్టించుకోని రాష్ట్రప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు కోసం కొత్తగా టెండర్లను ఆహ్వానించింది. సుమారు 1, 395 కోట్ల రూపాయల పనులకు టెండర్లు పిలుస్తూ శనివారం ఆదేశాలు జారీచేసింది. ప్రభుత్వమే స్వయంగా చెల్లింపులకు సిద్ధపడి మరీ ఈ టెండర్లకు ఆహ్వానం పలికింది. స్పిల్‌వేలో 60 శాతం, స్పిల్‌ ఛానల్‌లో 40 శాతం కాంక్రీట్ పనులకు, స్పిల్‌ ఛానల్‌లో కోటి 40 లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టిపనులకు టెండర్లను ఆహ్వానించారు. పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టర్‌ను మార్చడానికి అంగీకరించ బోమని, దాని బదులు సదుపాయాలు, ఆర్థిక వనరులు ఇచ్చి ఉన్న కాంట్రాక్టర్ నే బలోపేతం చేసి పని చేయించు కోవాలని కేంద్రప్రభుత్వం ఇటీవలసూచించింది. అలాక్కాదు మార్చి తీరాలనుకుంటే అందువల్ల అయే అదనపు వ్యయం భరించడానికి సిద్ధపడి ఆ పని చేయాలని కూడా కేంద్రం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అయితే చంద్రబాబు సర్కారు తన ఆలోచన సుస్పష్టంగా ఉండడంతో కొత్త టెండర్లకు సిద్ధపడింది. ట్రాన్స్‌ ట్రాయ్‌ చేస్తున్న కొన్నింటిని టెండర్లకు పిలిచిన ప్రభుత్వం డిసెంబర్‌ 4ను ఆఖరుతేదీగా ప్రకటించింది. అయితే ఈ టెండర్ల కు కార్యరూపం వచ్చి, పనులు జరిగి.. 2019 లోగా పూర్తయ్యే అవకాశాలు అంతంతమాత్రమేనని ఇరిగేషన్‌ అధికారు లు చెబుతున్నారు. ఇదిలాఉండగా, పోలవరం ప్రాజెక్టు పనులు వేగంగా, సక్రమంగా జరగడంలేదని కేంద్రం అసంతృప్తితో ఉంది అని అంటున్నారు.

ముఖ్యాంశాలు