ప్రభుత్వం తదుపరి ఎత్తు 1+1+1

పెద్దనోట్ల రద్దు తరువాత  కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ అనే పెద్ద సంస్కరణకు సిద్ధమై అందులోనూ విజయం సాధించింది. మరి తర్వాత? ఈజ్ ఆఫ్ బిజినెస్‌లో భారత్ 30 ర్యాంకులు ఎగబాకడం, అంతర్జాతీయ  రేటింగ్ సంస్థ  మూడీస్ రేటింగ్ పెరగడం వంటి సానుకూల పరిణామాల నేపథ్యంలో నరేంద్రమోదీ ప్రభుత్వం ఇపుడు  మరో పెద్ద సంస్కరణకు సన్నద్ధం అవుతున్నట్టు భోగట్టా. డీమానిటైజేషన్, జీఎస్‌టీ, ఆధార్ అనుసంధానం లాంటి సంస్కరణల తరువాత ప్రభుత్వం కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటోంది. ఆధార్ అనుసంధానంపై ఇంకా  వివాదం సాగుతుండగానే1 బిలియన్ , 1 బిలియన్, 1 బిలియన్ కనెక్టివిటీపై ప్రభుత్వం దృష్టి పెట్టిందనేది తాజా సమాచారం. 100కోట్ల ఆధార్ నంబర్లు, 100కోట్ల బ్యాంకు ఖాతాలు అలాగే  100 కోట్ల మొబైల్స్ ను లింక్ చేయడం ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యం. పెద్దనోట్ల రద్దు తర్వాత మారుతున్నా ప్రభుత్వ విధానాలను ప్రజలు బాగానే అర్థం చేసుకున్నారు. నమోదవుతున్న బ్యాంక్ ఖాతాలు,  పుంజుకుంటున్న డిజిటల్ లావాదేవీలే దీనికి నిదర్శనం. ఈ 1 + 1 +1 ప్లాన్ ను మోదీ తొందర్లనే ప్రకటించవచ్చని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. దీనికి అనుబంధంగానే చెక్ పుస్తకాల రద్దు కూడా ఉంటుందని విశ్వసిస్తున్నారు. 
 

Facebook