పాక్ కు మద్దతుగా ఫరూక్ అబ్దుల్లా పిచ్చి వ్యాఖ్యలు


జమ్ముకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్‌ అబ్దుల్లా భారత కేంద్ర ప్రభుత్వంపై దిగజారుడు వ్యాఖ్యలు చేయడమే కాకా పాకిస్థాన్ కు అనుకూలంగా మాట్లాడారు. జమ్ములో జరిగిన ర్యాలీలో ఆయన ప్రసంగిస్తూ మతవిద్వేషాలను రెచ్చగొట్టి భారత్‌ను మరికొన్ని ముక్కలు చేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. దీనిని సహించబోమని హెచ్చరించారు. ‘ఒక పాకిస్థాన్‌ను సృష్టించారు. అలా ఎన్ని పాకిస్థాన్‌లను ఏర్పాటు చేయాలనుకుంటున్నారు? భారత్‌ను ఎన్ని ముక్కలు చేస్తారు’? అని ఆయన కేంద్రాన్ని ప్రశ్నించారు. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌(పీవోకే) విషయంపై ఆయన చేసిన వ్యాఖ్యలను మరోసారి నిస్సిగ్గుగా సమర్థించుకున్నారు. ‘పీవోకే పాకిస్థాన్‌దే... వారి దగ్గర అణుబాంబులు ఉన్నాయి. వాళ్ల చేతుల్లో మేము చనిపోవాలనుకుంటున్నారా? సరిహద్దు ప్రాంతాల్లో నివసించే ప్రజల పరిస్థితి పట్టించుకోరా’ అని అబ్దుల్లా మండిపడ్డారు. ఇటీవల పీవోకే పాకిస్థాన్‌కు చెందినదేనని, దాన్ని భారత్‌ తీసుకోవాలని చూస్తే పాక్‌ చూస్తూ వూరుకోదని అబ్దుల్లా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

ముఖ్యాంశాలు