పేస్ బుక్ లో క్వికర్, ఓఎల్ఎక్స్ తరహా సేవలు

త్వరలో ఫేస్బుక్ సెకండ్ హ్యాండ్వస్తువులు కొనడానికి, అమ్మడానికి వీలైన ఓఎల్ఎక్స్, క్వికర్ తరహా సేవలను కూడా అందుబాటులోకి తెస్తోంది. మార్కెట్ ప్లేస్ పేరుతో త్వరలో ఈ సెల్/బై ఆప్షన్ రాబోతోంది. ఇప్పటికే అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, థాయిలాండ్ సహా 25 దేశాల్లో ఈ ఆప్షన్ అందుబాటులో ఉంది. ఇటీవల ముంబయిలో ప్రయోగాత్మకంగా ఈ ఆప్షన్ను ప్రవేశపెట్టారు. త్వరలో దేశవ్యాప్తంగా అందరూ అందరూ ఈ సేవను వాడుకోవచ్చు. ఈ ఆప్షన్ ఓఎల్ఎక్స్, క్వికర్ తరహాలోనే పని చేస్తుంది. ఫేస్బుక్ పేజీలో మార్కెట్ ప్లేస్ అని ఓ ట్యాబ్ వస్తుంది. అందులోకి వెళ్లి అమ్మదలచిన లేదా కొనదలచిన వస్తువుల ఫొటోలు పెట్టి వివరాలు రాయాలి. అది చూసి నచ్చినవారు ఛాటింగ్ లేదా కాల్ ద్వారా సంప్రదిస్తారు.