బ్రాహ్మణి, ఉపాసన @ బ్లడ్ డొనేషన్ క్యాంప్

నంది అవార్డుల విషయంలో వివాదం నేపథ్యంలో రాష్ట్రం అంతా మెగా, నందమూరి అభిమానులు, మద్దతుదారులు మీడియా, సోషల్ మీడియా వేదికలుగా వాదులాడుకుంటున్నారు. అయితే మెగా, నందమూరి కుటుంబాల మధ్య దూరం ఏదీ పెరగలేదని  ఆ రెండు కుటుంబాల వారు కలిసి సామాజిక కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్న ఉదంతాలు చూసైనా జనానికి అర్థం అయితే బాగుండేది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కోడలు, రామ్ చరణ్ భార్య  ఉపాసన ఓ ఫొటోను తన సోషల్ మీడియా పేజ్ లో పోస్ట్ చేసింది. ఓ రక్తదాన శిభిరంలో ఉపాసన, బ్రాహ్మణి కలసి పాల్గొన్నప్పటి చిత్రం అది. బ్రాహ్మణితో కలిసి దిగిన ఫొటోను పోస్ట్ చేసిన ఉపాసన ఒక వ్యాఖ్య కూడా జత చేసారు. 18 ఏళ్ల వయసులో రక్తదానం ప్రారంభిస్తే ప్రతీ 90 రోజులకు ఒకసారి చొప్పున 60 ఏళ్ల వరకు చేయవచ్చున\ని, దాదాపు 500 మంది ప్రాణాలను కాపాడవచ్చునని పేర్కొంది. 

Facebook
Twitter