ముఖ్యమంత్రి ఇల్లయినా సరే తొలగిస్తాం


పర్యావరణ నిబంధనలకు అనుగుణంగా లేకపోతే కృష్ణానది కరకట్ట లోపల ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసాన్ని కూడా తొలగిస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. కరకట్ట లోపల నది నుంచి వంద మీటర్ల వరకు నిర్మాణాలు ఉండకూడదని నిబంధన అన్నారు. సీఎం నివాసం వంద మీటర్ల లోపుంటే అది కూడా తొలగిస్తామన్నారు. జాతీయ హరిత ట్రిబ్యునల్‌(ఎన్జీటీ) ఇచ్చిన తీర్పు ప్రకారం కరకట్ట లోపల ఎటువంటి నిర్మాణాలు ఉండకూడదు, మరి ప్రస్తుతమున్న నిర్మాణాల పరిస్థితి ఏమిటని విలేకరులు ప్రశ్నిస్తే మంత్రి ఇచ్చిన జవాబు ఇది. నది నుంచి వంద మీటర్ల లోపు ఉన్న నిర్మాణాలన్నింటినీ తీసేయాల్సిందే అని, సీఎం నివాసం ఈ పరిధిలోపు ఉందో లేదో చూసి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. రాజధాని నిర్మాణానికి హరిత ట్రిబ్యునల్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడం శుభపరిణామమన్నారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం