అనంతపురంలో కొరియన్ సిటీ


అనంతపురం జిల్లా కొరియా సంస్థల నిలయంగా మారనుంది. శనివారం దక్షిణ కొరియా కాన్సుల్‌ జనరల్‌ కిమ్‌ హంగ్‌ టే ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. 37 కొరియా సంస్థలు జిల్లాకి వస్తున్న విషయాన్ని ఆయన తెలిపారు. వీటి ద్వారా అక్కడ రూ.4వేల కోట్ల పెట్టుబడులు, ఏడు వేల మందికి ఉద్యోగావకాశాలు వస్తాయన్నారు. అనంతపురంలో కొరియా సిటీ ని అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు. కియా మోటార్స్‌, దాని అనుబంధ సంస్థలు ఇప్పటికే అక్కడ పెట్టుబడులు పెడుతున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌ వైపు కొరియాలోని పరిశ్రమలు ఆసక్తిగా చూస్తున్నాయని పేర్కొన్నారు. ఇక్కడ నుంచి మిర్చి, పొగాకు, జౌళి ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహిస్తామని చెప్పారు. సీఎం చంద్రబాబు మాట్లాడుతూ అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేయబోయే కొరియాన్‌ సిటీ ఎలా రూపురేఖలను అడిగి తెలుసుకున్నారు. వీరికి సహకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఆర్థికాభివృద్ధి మండలి (ఈడీబీ), ప్రభుత్వ శాఖలు కృషి చేస్తున్నాయన్నారు. రాష్ట్రంలో కొరియా భాష నేర్పే కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సీఎం కోరారు. దక్షిణ కొరియా లో పర్యటించాలని ముఖ్యమంత్రి చంద్రబాబును కిమ్‌ హంగ్‌ టే ఆహ్వానించగా చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. మార్చిలో దక్షిణ కొరియాలో పర్యటిస్తానని చెప్పారు.

ముఖ్యాంశాలు