ఇవాళ సినీ ప్రముఖులకు సత్కారాలు


సామాజిక మాధ్యమాల్లో అత్యధిక జనాదరణ కలిగిన హిందీ నటి దీపికా పదుకొనె తో పటు హీరో దగ్గుబాటి రానా, సంగీత దర్శకుడు అనిరుధ్‌ తదితరులకు సోషల్‌మీడియా సమ్మిట్‌-2017 అవార్డులు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. విజయవాడ ఎ- కన్వెన్షన్ సెంటర్ లోలో రెండు రోజుల సదస్సును శనివారం పర్యాటకశాఖ మంత్రి భూమా అఖిలప్రియ ప్రారంభించిన సంగతి విదితమే. ఇదే వేదికపై ఆదివారం (నవంబర్ 19 )పర్యాటక శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న మెగా ఈవెంట్లలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటుచేశామని మంత్రి వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చేతులమీదుగా సినీ ప్రముఖులకు అవార్డులను ప్రదానం చేయనున్నట్టు మంత్రి వెల్లడించారు.