ఐఏఎస్ తలచుకుంటే అలాఉంటుంది!

చాలామంది ఐఏఎస్ అధికారులు ఇవాళ రాజకీయ నాయకుల చేతుల్లో కీలుబొమ్మలుగా మారిపోయి అయ్యా ఎస్ అంటూ ఉండడం మనం చూస్తున్నాం... కానీ కొందరుంటారు..! ఐఏఎస్ పవర్ ఏమిటో చూపించే నిఖార్సైన అధికారులు వాళ్ళు. వాళ్ళు తలచుకుంటే.. వాళ్ళతో పెట్టుకుంటే మంత్రులైన సరే కుదేలవుతారు. కేరళ రవాణాశాఖ మంత్రి థామస్‌ చాందీ రాజీనామా ఉదంతం ఇందుకు తాజా ఉదాహరణ. ఆయన రాజీనామా చేయక తప్పని అనివార్య స్థితిని కల్పించింది ఒక మహిళా యువ ఐఏఎస్ అధికారి అంటే ఆశ్చర్యం కలగొచ్చు... కానీ ఇదినిజం. కేరళలో టూరిజానికి నెలవైన ఆలప్పుళ జిల్లా కలెక్టర్‌ గా అనుపమ ఉన్నారు. అక్కడి మార్తాండం సరస్సులో కొంత భాగాన్ని రవాణా మంత్రి చాందీ పూడ్చేసి అక్కడ లేక్‌ ప్యాలస్‌ రిసార్ట్‌ని కట్టుకుని వ్యాపారం చేస్తున్నాడు. దీనిపై రెవెన్యూ శాఖ కార్యదర్శికి కలెక్టర్ గా ఆమె ఒక నివేదిక ఇచ్చారు. అయితే దీనిపై మంత్రి హైకోర్టుకి వెళ్లారు. తన ప్రభుత్వం పై తానే దావా వేసినట్టుగా ఆయన తీసుకున్న ఈ చర్యని  మీడియా తప్పుబట్టింది. అనేక పార్టీలు ఛీకొట్టాయి. కానీ ఆయన లెక్కచేయలేదు. అయితే కోర్టు కూడా ఈ విషయంలో మండిపడింది. అతడి తీరుని తీవ్రంగా తప్పుబట్టింది. ఇక తప్పనిసరై ఆయన  రాజీనామాచేసారు. ఇది ఒక ఐఏఎస్‌ అధికారి సాధించిన విజయం. ఇప్పుడు ఆ ధికారిని ఏమి చేస్తున్నారో తెలుసా..  థామస్‌ చాందీ కబ్జా ఎంత మేరకు జరిగిందనే విషయాన్నీ శాటిలైట్‌ సాయంతో ధ్రువపరిచే ఆధారాలు సేకరిస్తున్నారు. అవి చేతికి రాగానే కబ్జా చేసిన కట్టడాల్ని కూల్చేస్తానని చెబుతున్నారు.