మాతృభాష కన్ను... ఇతర భాషలు కళ్లద్దాలు


కళ్లు సరిగా కనబడకపోతే పెట్టుకునేవి కళ్లద్దాలు. వాటివలన దృష్టి ఇంకా బాగుపడు తుంది. కానీ అసలు కన్నే లేకపోతే కళ్లద్దాలు పెట్టుకున్నా లాభం ఉండదు గదా... అలాగే కన్ను వంటి మాతృభాషను నిర్లక్ష్యం చేసి ఎన్ని అన్య భాషలు నేర్చుకున్నా ప్రయోజనం ఉండదు. మాతృభాషలో మాట్లాడటానికి అందరూ ప్రాధాన్యమివ్వాలి. అమ్మా అంటే అంతరాల్లో నుంచి, మమ్మీ అనే పదం పెదాల నుంచి వస్తుంది. అమ్మభాష భావ వ్యక్తీకరణకు విశిష్ట సాధనం.... అని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. విద్యార్థులు తప్పనిసరిగా తెలుగు చదవాలని సీఎం కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన శ్లాఘించారు. సంగారెడ్డి జిల్లా రుద్రారంలోని గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయం ఎనిమిదో స్నాతకోత్సవ వేడుకలను శనివారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ సంస్కృతి, సంప్రదాయాల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని, కనిపెంచిన తల్లిని, సొంత ఊరిని, మాతృభాషను, మాతృదేశాన్ని మర్చిపోయిన వారు వ్యర్థ జీవులని అన్నారు, చాలా మంది ఇక్కడ బాగా చదువుకొని విదేశాలకు వెళ్లిపోతున్నారన్నారు ఆలా వెళ్ళినవారు బాగా నేర్చుకోవాలని, సంపాదించాలని... ఆనక తిరిగి రావాలని ఉద్భోధించారు.


ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం