సిక్కింలో పాక్యాంగ్ ఎయిర్ పోర్టు సిద్ధమైంది


సిక్కింలొని పాక్యాంగ్ ఎయిర్ పోర్టు నిర్మాణం పూర్తయి ప్రారంభానికి సిద్ధమైంది. సిక్కిం లోని పాక్యాంగ్ ఎయిర్ పోర్టు నిర్మాణానికి 2008, అక్టోబర్ లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆమోదం తెలిపి శంకుస్థాపన కూడా చేసింది. ఫిబ్రవరి, 2009 లో ఈ ఎయిర్ పోర్టు నిర్మాణానికి అప్పటి పౌరవిమానయాన శాఖా మంత్రి ప్రఫుల్ పటేల్ శంకుస్థాపన చేశారు. దీనిని 2012 లోగా పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే ఇందుకోసం చేపట్టిన స్థల సేకరణ, స్థానికుల పునరావాసం, నష్ట పరిహారం డిమాండ్ల నేపథ్యంలో ఆందోళనలు జరిగాయి. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఎయిర్ పోర్టు నిర్మాణాన్ని గాలికి వదిలేసింది. ఫలితంగా 2009 నుండి 2014 వరకు ఈ పనులు నిలిచిపోయాయి. 2014 లో నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చాకా 2014 అక్టోబర్ లోనే అక్కడి స్థానికులతో చర్చలు జరిపి, వారి డిమాండ్లను నెరవేర్చింది. దీంతో 2015 లో తిరిగి పాక్యాంగ్ ఏయిర్ పోర్టు నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈసారి పనులు చకచకా జరిగి ఎయిర్ పోర్ట్ సిద్ధం అయిపోయింది. వచ్చే నెలలో దీనికి ప్రారంభొత్సవం చేయనున్నారు. ఇది సిక్కిం రాష్ట్రంలోనే మొట్టమొదటి ఎయిర్ పోర్టు కావడం విశేషం

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం