అవార్డులపై ఇదేమి రగడ?


నంది అవార్డుల విషయంలో తలెత్తిన వివాదం మొత్తానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కదిలించింది. దీనిపై సీఎం చంద్రబాబు స్పందించారు. సోమవారం వ్యూహ కమిటీ భేటీలో ఈ అంశాన్ని ఆయన ప్రస్తావించారు. నంది అవార్డుల వ్యవహారం ఇంత రచ్చ అవుతుందని అనుకోలేదని చంద్రబాబు చెప్పారు. ఇలా అవుతుంది అనుకుంటే కమిటీ మీద పెట్టకుండా... ఐవీఆర్‌ఎస్‌ సర్వే చేయించి మరీ అవార్డులు ఇచ్చేవాళ్లమని తెలిపారు. ప్రతి విషయానికి కులం రంగు పులమడం ఏమిటంటూ ఆవేదన వ్యక్తం చేశారు. జ్యూరీ సభ్యుల నిర్ణయం మేరకే అన్ని అవార్డులు ఇచ్చామని.. అయినా ఇలా ఎందుకు జరిగిందని ప్రశ్నించారు. జగన్‌ ప్రజా సంకల్పయాత్ర గురించి పట్టించుకోవా ల్సిన అవసరం లేదని చంద్రబాబు అన్నారు. జగన్ యాత్రని ప్రజలే పట్టించుకోవడం లేదని వ్యాఖ్యానించారు. దీనిపై పార్టీ పరంగా స్పందించనక్కర్లేదని అభిప్రాయపడ్డారు.

ముఖ్యాంశాలు