అవార్డులపై విమర్శలు స్థానికేతరుల కుట్ర


నాన్‌ రెసిడెంట్‌ ఆంధ్రా వాళ్లు మాత్రమే ఏపీ ప్రభుత్వంపై తప్పుడు విమర్శలు చేస్తున్నారని మంత్రి నారా లోకేశ్‌ ధ్వజమెత్తారు. ఆధార్‌ కార్డు, ఓటరు కార్డు స్థానికంగా లేని వారు హైదరాబాద్‌లో కూర్చుని నంది అవార్డులపై ఆరోపణలు చేయడం దురుద్దేశం కాక మరేమిటని ప్రశ్నించారు. ప్రత్యేకహోదా అంటూ కొందరు హైదరాబాద్‌ నుంచి ఉదయం ఫ్లయిట్ లో విజయవాడకు వచ్చి ధర్నా చేసి మధ్యాహ్నం తిరిగి వెళ్లిపోతున్నారని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ వాయిదా అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పటిష్టమైన జ్యూరీ ఏర్పాటు చేసి మూడేళ్ల అవార్డులు ఒకేసారి ఇస్తే ముఖ్యమంత్రిపై విమర్శలు ఏమిటని మండిపడ్డారు. నంది అవార్డుల జ్యూరీలో సభ్యులుగా ఉన్నవాళ్లు కూడా విమర్శలు చేయడం విచారకరమన్నారు. ప్రత్యేక హోదా కోసం దిల్లీలో ధర్నాలు చేయాలనీ అయన సలహా ఇచ్చారు. అవార్డులపై విమర్శల విషయంలో సీఎం చాలా బాధపడ్డారని లోకేశ్‌ తెలిపారు. ఇక్కడ స్థానికత లేని వారికి అవార్డులపై విమర్శించే హక్కు లేదన్నారు.